లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన జగిత్యాల డిటిఓ..
తెలంగాణ, జగిత్యాల. 6 ఆగస్టు (హి.స.) మరికొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్న ఓ జిల్లా అధికారి లంచం తీసుకుంటూ నేడు ఏసీబీకి చిక్కారు. జగిత్యాల జిల్లాలో బుధవారం జరిగిన ఘటన వివరాలు.. జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి భద్రునాయక్ ఈ నెల 31న రిటైర్మెంట
ఏసీబీ


తెలంగాణ, జగిత్యాల. 6 ఆగస్టు (హి.స.)

మరికొద్ది రోజుల్లో పదవీ విరమణ

చేయబోతున్న ఓ జిల్లా అధికారి లంచం తీసుకుంటూ నేడు ఏసీబీకి చిక్కారు. జగిత్యాల జిల్లాలో బుధవారం జరిగిన ఘటన వివరాలు.. జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి భద్రునాయక్ ఈ నెల 31న రిటైర్మెంట్ కాబోతున్నారు. అయితే పట్టుకున్న జేసీబీని విడిచిపెట్టేందుకు శశిధర్ అనే వ్యక్తి ఆ అధికారిని ఆశ్రయించాడు.

రూ. 22 వేలు లంచంగా తీసుకునేందుకు డీటీవో అంగీకారం చేసుకున్నాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా బుధవారం జగిత్యాల రవాణాశాఖ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. డీటీవో వద్ద లభించిన రూ.22 వేలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande