జంతర్మంతర్లో జరిగేదంతా నాటకమే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
తెలంగాణ, ఆసిఫాబాద్. 6 ఆగస్టు (హి.స.) బీసీ రిజర్వేషన్లకు సాధనకు ఇవాళ ఢిల్లీ లోని జంతర్మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్ష అంతా నాటకమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. ఇవాళ ఆయన అసిఫాబాద్ లో మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వే
బిజెపి చీఫ్


తెలంగాణ, ఆసిఫాబాద్. 6 ఆగస్టు (హి.స.)

బీసీ రిజర్వేషన్లకు సాధనకు ఇవాళ

ఢిల్లీ లోని జంతర్మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్ష అంతా నాటకమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. ఇవాళ ఆయన అసిఫాబాద్ లో మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై చర్చించేందుకు తమకు రాష్ట్రపతి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు రాంచందర్ రావు కౌంటర్ ఇచ్చారు. అసలు జంతర్మాంతర్ వద్ద జరిగేదంతా నాటకమేనని అన్నారు.

బీసీలపై కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని.. ఒకవేళ ఉంటే బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చకుండా కేంద్రానికి 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రానికి పంపించాల్సి ఉండే అని కామెంట్ చేశారు. రిజర్వేషన్లపై అసలు రాష్ట్రపతి అపాయింట్మెంట్ అవసరమే లేదన్నారు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ కంటే కేంద్ర మంత్రులే ఎక్కువ సార్లు అపాయింట్మెంట్ ఇచ్చారని సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ కంటే రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షాలనే ఎక్కువగా కలిశారని తెలిపారు. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదని రాంచందర్ రావు అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande