బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతాం.. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, 6 ఆగస్టు (హి.స.) ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను సాధించి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల సాధనకు కాంగ్రెస్ చేపట్టిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్
సీఎం రేవంత్ రెడ్డి


న్యూఢిల్లీ, 6 ఆగస్టు (హి.స.)

ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో బీసీ

రిజర్వేషన్లను సాధించి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల సాధనకు కాంగ్రెస్ చేపట్టిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ కులగణన చేపట్టామని అన్నారు. విద్య, ఉపాధి, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు చట్ట సభల్లో తీర్మానం చేసి బిల్లులను గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపామని తెలిపారు.

బిల్లులపై మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల తంతును హైకోర్టు సెప్టెంబర్ 30లోపు పూర్తి ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. ఈ క్రమంలోనే బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం అనివార్యమైందని.. కేంద్రం వెంటనే వాటిని ఆమోదించాలని, అప్పటి వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. చర్చించేందుకు తమకు అపాయింట్మెంట్ ఇవ్వాలని రాష్ట్రపతి ని కోరామని.. ఇప్పటి వరకు వారు స్పందించకపోవడం శోచనీయమని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande