తెలంగాణ, జగిత్యాల. 6 ఆగస్టు (హి.స.)
ఎరువుల క్రయ విక్రయాలకు సంబంధించిన రికార్డులను తప్పనిసరిగా ఆధార్ కార్డుతో నమోదు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ తెలిపారు. బుధవారం రోజు పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు యూరియా, ఇతర ఎరువుల స్టాక్ వివరాలను, ఎరువుల సరఫరాపై ప్రతీ రైతుకి ఎన్ని బస్తాలు సరఫరా చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా రైతులకు సంబంధించిన భూమి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ప్రస్తుతం రైతులు వేసిన పంటకు అవసరమైన ఎరువులు మాత్రమే సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. రికార్డులు పరిశీలించి స్టాక్ ఎంత వచ్చింది. ఎంత సరఫరా చేశాం అన్నది తప్పనిసరి రికార్డ్ చేసుకోగలరని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతులకు ఎవరికైనా ఎక్కువ మొత్తంలో ఎరువులు పంపిణీ చేసినట్లయితే అట్టి సొసైటీ సిబ్బందిపై, వ్యవసాయ శాఖ సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు