పర్యావరణ రహిత జ్యూట్ బ్యాగులను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అనుదీప్
ఖమ్మం, 6 ఆగస్టు (హి.స.) ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఆధ్వర్యంలో రూపొందించిన జ్యూట్ బ్యాగులను జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి బుధవారం ఆవిష్కరించారు. స్థానిక నూతన కలెక్టరేట్ లో జిల్లా స్మార్ట్ కిడ్జ్ పాఠశాల కరస్పాండెంట్ తో కలిసి పర్యావరణహితమై
ఖమ్మం కలెక్టర్


ఖమ్మం, 6 ఆగస్టు (హి.స.) ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఆధ్వర్యంలో రూపొందించిన జ్యూట్ బ్యాగులను జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి బుధవారం ఆవిష్కరించారు.

స్థానిక నూతన కలెక్టరేట్ లో జిల్లా స్మార్ట్ కిడ్జ్ పాఠశాల కరస్పాండెంట్ తో కలిసి పర్యావరణహితమైన జ్యూట్ బ్యాగులను కలెక్టర్ నేడు ఆవిష్కరించడం జరిగింది. గత ఐదు సంవత్సరాలుగా ఆ పాఠశాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జ్యూట్ బ్యాగులను తయారు చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు, ప్రజలకు అందిస్తున్నారు.

దీంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా జ్యూట్ బ్యాగులను పాఠశాల ఆధ్వర్యంలో తయారుచేయించి, బుధవారం కలెక్టర్ అనుదీప్ తో ఆవిష్కరించడం నిర్వహించారు. .

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande