రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ పై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, 6 ఆగస్టు (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో వివాదాస్పద మంత్రిగా పేరుగాంచిన మంత్రి కొండా సురేఖ . ఈ సారి ఢిల్లీ కేంద్రంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు.
మంత్రి సురేఖ


న్యూఢిల్లీ, 6 ఆగస్టు (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలో వివాదాస్పద

మంత్రిగా పేరుగాంచిన మంత్రి కొండా సురేఖ . ఈ సారి ఢిల్లీ కేంద్రంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. భారత రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులకు నరనరాల్లో కుల పిచ్చి పాతుకుపోయిందని, పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది వితంతు మహిళ అని మోడీ పిలవలేదని, రాష్ట్రపతి దళిత మహిళ కాబట్టి అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సైతం పిలవలేదని సంచలన ఆరోపణలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande