హైదరాబాద్, 6 ఆగస్టు (హి.స.)
అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' సినిమా ప్రిమీయర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)కి మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది.
ఈ తొక్కిసలాటలో ఒక మహిళ మరణించగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయంపై అందిన ఫిర్యాదును పరిశీలించిన జాతీయ మానవ హక్కుల కమిషన్, సినిమా థియేటర్ వద్ద తగిన భద్రతా చర్యలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను సీరియస్గా పరిగణిస్తూ, మృతురాలి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందించాలని అలాగే ఈ సంఘటనపై పూర్తి నివేదికను సమర్పించాలని తెలంగాణ పోలీసులను ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్