హైదరాబాద్, 6 ఆగస్టు (హి.స.) నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతీక, తెలంగాణ ముద్దుబిడ్డ, సిద్ధాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఘన నివాళులర్పించారు. జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా, ఏకైక ఎజెండాగా బతికిన మహనీయుడు జయశంకర్ సార్ అని కొనియాడారు.
భవిష్యత్ తరాలకు జయశంకర్ గారి స్ఫూర్తిని అందించాలనే ఉద్దేశంతో వారి జీవిత విశేషాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చిండు సీఎంగా కేసీఆర్. అగ్రికల్చర్ యూనివర్సిటీ, భూపాలపల్లి జిల్లాలకు వారి పేరు పెట్టడంతో పాటు, ఏటా ఆయన జయంతి, వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేలా నిర్ణయించారు. జయశంకర్ సార్.. ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని వారి మార్గంలో పయనించడమే వారికి మనమిచ్చే నిజమైన నివాళి అని హరీశ్రావు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..