జయశంకర్ సార్ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాలి : ఎమ్మెల్యే సంజయ్
తెలంగాణ, జగిత్యాల 6 ఆగస్టు (హి.స.) తెలంగాణ భావజాలవ్యాప్తికే తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా, ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్
ఎమ్మెల్యే సంజయ్


తెలంగాణ, జగిత్యాల 6 ఆగస్టు (హి.స.)

తెలంగాణ భావజాలవ్యాప్తికే తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా, ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా మెట్పల్లిలో జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాలర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ మలిదశ ఉద్యమ రథసారథి కేసీఆర్కు అనునిత్యం అండగా ఉంటూ.. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసేందుకు కడదాక పోరాడిన ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్న నేటి తరుణంలో.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడటానికి జయశంకర్ సార్ ఉద్యమ స్ఫూర్తిని, సిద్ధాంతాలను భావితరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఎంతగానో ఉందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande