భద్రాద్రి కొత్తగూడెం, 6 ఆగస్టు (హి.స.)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ
రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు టేకులపల్లి పోలీసులు బుధవారం ఉదయం మండల కేంద్రంలో కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డెన్ అండ్ సెర్చ్) నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లందు డీఎస్పీ చంద్ర భాను మాట్లాడుతూ.. సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడొద్దని సూచించారు. బ్యాంక్ ఖాతా, ఏటీఎం పిన్ నెంబర్లు, ఓటీపీ వివరాలు చెప్పవద్దన్నారు. ఆశచూపిస్తే వాటికి ఆకర్షితులు కావొద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని సూచించారు. వ్యక్తిగత ఫొటోలను డీపీలుగా పెట్టుకోవద్దన్నారు. పోలీసులను ఫోన్ చేసాం మీ ఖాతా నెంబరు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంది పోలీస్ శాఖ పరంగా మీకు సహాయం చేస్తామని తెలిపిన అటువంటి వాటిని నమ్మవద్దని మీకు అందుబాటులో ఉన్న బ్యాంకు వెళ్లాలని తెలిపారు.
పోలీస్ శాఖకు బ్యాంకు ఖాతాల వివరాలు అవసరం లేదని తెలిపారు. మీకు పదే పదే ఫోన్ చేసి విసిగిస్తే మీ అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయాలని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు