సమయపాలన పాటించని అధికారులపై చర్యలు : సిద్దిపేట కలెక్టర్ హైమావతి హెచ్చరిక
తెలంగాణ, సిద్దిపేట. 6 ఆగస్టు (హి.స.) అధికారులు సమయపాలన పాటించి విధులను సక్రమంగా నిర్వహించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి జిల్లా అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. బుధవారం రాయపోల్ మండ
సిద్దిపేట కలెక్టర్


తెలంగాణ, సిద్దిపేట. 6 ఆగస్టు (హి.స.)

అధికారులు సమయపాలన

పాటించి విధులను సక్రమంగా నిర్వహించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి జిల్లా అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. బుధవారం రాయపోల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. అటెండెన్స్ రిజిస్టర్, ఓ పి రిజిస్టర్, విసిట్ రిజిస్టర్లను ఆమె పరిశీలించారు. సంబంధిత వైద్యురాలు దుబ్బాక లో మీటింగ్ వెళ్లారని సిబ్బంది తెలపగా స్థానిక అధికారులతో మాట్లాడి నిజనిర్ధారణ చేశారు.

ల్యాబ్ సిబ్బందితో శాంపిల్స్ టి-హబ్ కి పంపిస్తున్నారా అని అడిగి రాండమ్ టెస్ట్ లు చేస్తున్నారని ఆరా తీశారు. ర్యాపిడ్ టెస్టులు తప్పనిసరిగా పీహెచ్సీలోనే చేయాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో రెవెన్యూ సదస్సుల డిస్పోజల్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande