తెలంగాణ, సూర్యాపేట.6 ఆగస్టు (హి.స.)
సీనియర్ CPI నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజ్ అయోధ్య చారి సూర్యాపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో మరణించారు. ఈ విషాద ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన అయోధ్య చారి, ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్‌గా ప్రజల్లో సుపరిచితులు. పినపాక నియోజకవర్గం లో ఆయనకు బలమైన నాయకుడిగా పేరుంది. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం వెళ్లేందుకు ఆయన హైదరాబాద్ బయలు దేరి వెళ్తుండగా, సూర్యాపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు, ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అయోధ్య చారి అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. అయోధ్య మృతి పార్టీకి, ఆయన అభిమానులకు తీరని నష్టమని పలువురు నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు