దిల్లీ: 6 ఆగస్టు (హి.స.)
దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల భద్రతకు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్ర, సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యాయి (Indian Airports on Alert). అన్ని ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్ ప్రకటించారు.
ఈ ఏడాది సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2 మధ్య విమానాశ్రయాలపై దాడులు (Security Threat to Airports) జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో కేంద్ర పౌర విమానయాన భద్రతా బ్యూరో అన్ని ఎయిర్‌పోర్టులకు అడ్వైజరీ జారీ చేసింది. విమానాశ్రయాల్లో తక్షణమే భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. రన్‌వేలు, హెలీప్యాడ్స్, ఫ్లైయింగ్ స్కూల్స్, ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లలో భద్రత పెంచాలని సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ