మొహాలీ/దిల్లీ: 6 ఆగస్టు (హి.స.)
పంజాబ్‌లో మొహాలీలోని ఓ ఆక్సిజన్ ప్లాంట్‌లో భారీ పేలుడు (Explosion At Mohali Oxygen Plant) సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. స్థానికంగా ఫేజ్ 9లో ఉన్న ఫ్యాక్టరీలో బుధవారం ఉదయం ఈ పేలుడు సంభవించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వైద్య, అగ్నిమాపక, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆక్సిజన్ ప్లాంట్‌లో సిబ్బంది ఉండడంతో ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రులను ఫేజ్ 6 సివిల్ ఆస్పత్రికి తరలించామన్నారు. అయితే పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ