అమరావతి, 6 ఆగస్టు (హి.స.)ఉత్తరకాశీలో సంభవించిన ఆకస్మిక వరదకు ధరాలీ అనే గ్రామమంతా తుడిచి పెట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ విపత్తుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వరదల్లో అనేక మంది గల్లంతవ్వగా.. నలుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ విపత్తుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తరకాశీ వరద దృశ్యాలు తననెంతో కలచి వేశాయన్నారు. వరదలలో పలువురు మరణించారని తెలిసి ఎంతో బాధపడ్డానన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, వరదల్లో గల్లంతైన వారు సురక్షితంగా రావాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి