పులివెందుల, 6 ఆగస్టు (హి.స.)పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల(Pulivendula ZPTC elections)కు ముందే హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ(Ycp), టీడీపీ(Tdp) ఆధిపత్య ధోరణికి పాల్పడుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు ఉండగానే రెండు పార్టీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘర్షణకు దిగుతున్నారు. అధికార పార్టీ అక్రమంగా వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు. గతంలో మాదిరి దౌర్జన్యం చూస్తూ ఊరుకోమని టీడీపీ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. ఇలా పులివెందుల నియోజకవర్గంలో ఉత్కంఠ, ఉద్రిక్తత కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి