గుంటూరు, 6 ఆగస్టు (హి.స.)ఏపీ అభివృద్ధి(Ap Devolepment)పై హీరో సుమన్(Hero Suman) కీలక వ్యాఖ్యలు చేశారు. గుంటూరు(Guntur)లో పర్యటించిన ఆయన రాష్ట్రంలో అభివృద్ధి బాగుందని తెలిపారు. తాను పుట్టింది, పెరిగింది తమిళనాడు(Tamilnadu)లో కాబట్టి తనను అక్కడ పోటీ చేయమని అడిగారని, కానీ తాను తర్వాత చెబుతానని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలంటే అందరూ సపోర్ట్ చేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి బాగుందని తెలిపారు.తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సమయం ఉందని కాబట్టి ఇప్పుడే ఆ ఆలోచన చేయాల్సిన అవసరం లేదని హీరో సుమన్ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో వచ్చే సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయని, వాటి గురించి తర్వాత ఆలోచిస్తానని హీరో సుమన్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి