‘మీ సేవలకు సలాం’.. రేషన్ డీలర్‌ను ప్రశంసించిన మంత్రి
అమరావతి, 6 ఆగస్టు (హి.స.)రాష్ట్రంలో ఎన్డియే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా పలు హామీలను అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్కరణలను కూడా తీసుకొచ్చింద
‘మీ సేవలకు సలాం’.. రేషన్ డీలర్‌ను ప్రశంసించిన మంత్రి


అమరావతి, 6 ఆగస్టు (హి.స.)రాష్ట్రంలో ఎన్డియే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా పలు హామీలను అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్కరణలను కూడా తీసుకొచ్చింది. ఈ తరుణంలో ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటికి వెళ్లి రేషన్ సరుకులు పంపిణీ చేసేవారు. కానీ.. కూటమి ప్రభుత్వం ఇంటింటికి రేషన్ సరఫరాను రద్దు చేసి రేషన్ షాపులలో డీలర్ల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తోంది.

రేషన్ కార్డులున్న 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల సరుకులను మాత్రమే ప్రభుత్వం డోర్ డెలివరీ చేస్తోంది. ఈ తరుణంలో తాజాగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ క్రమంలో వర్షాన్ని లెక్కచేయకుండా కొండలు, గుట్టలు ఎక్కి తన బాధ్యతను నిర్వర్తించిన ఓ రేషన్ డీలర్‌ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశంసించారు. ‘‘

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande