ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ భేటీలో మోదీ వ్యాఖ్య - ప్రతిపక్షాలది స్వీయ విధ్వంసం
దిల్లీ: 6 ఆగస్టు (హి.స.) ఆపరేషన్‌ సిందూర్‌’పై చర్చకు పట్టుబట్టి విపక్షాలు తమను తామే దెబ్బతీసుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. పార్లమెంటులో ఈ అంశంపై ప్రత్యేక చర్చలో ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం ముందు నిలవలేక ఓటమి పాలయ్యారన్నారు. ప్రభుత్వాన
PM Modi meets the Indian community


దిల్లీ: 6 ఆగస్టు (హి.స.)

ఆపరేషన్‌ సిందూర్‌’పై చర్చకు పట్టుబట్టి విపక్షాలు తమను తామే దెబ్బతీసుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. పార్లమెంటులో ఈ అంశంపై ప్రత్యేక చర్చలో ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం ముందు నిలవలేక ఓటమి పాలయ్యారన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వచ్చిన ఒకేఒక్క అవకాశాన్ని కూడా వారు వినియోగించుకోలేకపోయారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మంగళవారం ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. దేశ భద్రత విషయంలో విపక్షాల ధోరణి, నేతల్లో అభిప్రాయ భేదాలు పార్లమెంటు చర్చలో బయటపడ్డాయని, ఇలాంటి ప్రతిపక్ష నేతలను ఇంకెక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ రాజ్యాంగం గురించి మాట్లాడే కాంగ్రెస్‌ నేతలు తాము అధికారంలో ఉన్నప్పుడు జమ్మూకశ్మీర్‌లో దానిని అమలుచేయలేదని విమర్శించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande