దిల్లీ: 6 ఆగస్టు (హి.స.)
భారత్ (India)పై గణనీయంగా టారిఫ్‌లు పెంచుతానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బెదిరింపులకు దిగిన సంగతి తెలిసిందే. వీటిపై ప్రధాని మోదీ (PM Modi) మౌనంగా ఉండటంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విరుచుకుపడ్డారు. ఈసందర్భంగా మోదీ చేతులు కట్టేశారంటూ ఎద్దేవా చేశారు.
అమెరికాలో అదానీపై విచారణ జరుగుతుంది కాబట్టి.. టారిఫ్‌లపై ట్రంప్ పదేపదే బెదిరింపులకు పాల్పడినా మోదీ మౌనంగా ఉండిపోయారని రాహుల్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ విషయాన్ని దేశ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. మోదీ, AA (అదానీ, అంబానీలను ఉద్దేశిస్తూ), రష్యా చమురు ఒప్పందాల ఆర్థిక వ్యవహారాలు బయటపడతాయని వ్యాఖ్యానించారు. మోదీ చేతులు కట్టేశారంటూ విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ