దిల్లీ: 6 ఆగస్టు (హి.స.)దేశ ఆర్థిక విధానాన్ని నియంత్రించే భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్రవ్య పరపతి కమిటీ (Monetary Policy Committee) తమ మూడురోజుల సమీక్ష సమావేశం అనంతరం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తాజా ప్రకటన ప్రకారం, రెపో రేటును 5.5% వద్దనే ఉంచుతూ, తటస్థ వైఖిరిని కొనసాగించనుంది. ఈ నిర్ణయం మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈసారి కూడా రెపో రేటును యథాతథంగా ఉంచుతూ RBI మరోసారి వడ్డీ రేటులపై అనిశ్చితిని నివారించింది. జూన్ నెలలో చేసిన 50 బేసిస్ పాయింట్ల కోత తర్వాత ఇదే తొలి సమీక్ష. ఈ విషయమై ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా ప్రకారం.. కమిటీలోని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ