మూసీపైన మాటలు మాత్రమే.... కార్య రూపం దాల్చలేదు : రామచంద్ర రావు
హైదరాబాద్, 7 ఆగస్టు (హి.స.) మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి మాటలు కేవలం ప్రగల్భాలు మాత్రమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ఆరోపించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ కార్యకర్తల సమ్మేళనం సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భ
బిజెపి చీఫ్


హైదరాబాద్, 7 ఆగస్టు (హి.స.)

మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి మాటలు కేవలం ప్రగల్భాలు మాత్రమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ఆరోపించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ కార్యకర్తల సమ్మేళనం సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భువనగిరి ప్రజలు బీజేపీ పార్టీని ఆదరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఇక్కడి ప్రాంతంలో బీజేపీకి భారీగా సీట్లు వస్తాయి అనే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మూసీ ప్రక్షాళన చేస్తా అనే మాటలు చెప్పారని, కేవలం మూసీపైన మాటలే మాత్రమేనని కార్య రూపం దాల్చిలేదన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande