హైదరాబాద్, 7 ఆగస్టు (హి.స.)
ప్రపంచ పర్యాటక ప్రాంతంగా పేరొందిన భూదాన్ పోచంపల్లిలో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పోచంపల్లిలో ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి లో 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత విగ్రహానికి, కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం చేనేత సహకార సంఘం భవనంలో చేనేత ఇక్కత్ వస్త్రాలను పరిశీలించి కార్మికులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా పట్టణంలోని చేనేత కార్మికుల గృహాలను సందర్శించి చేనేత మగ్గాలపై తయారు చేసే చీరల పనితీరును, నూలు దారం, రంగులు అద్దకం, ఆసు యంత్రం పని తీరు ప్రక్రియను పరిశీలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్