న్యూఢిల్లీ, 7 ఆగస్టు (హి.స.)
తెలంగాణ స్టేట్ పాలిటిక్స్ ఢిల్లీకి చేరాయి. రాష్ట్ర చట్ట సభల్లో ఆమోదించి కేంద్రం ఆమోదానికి పంపిన బిల్లులపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తో సహా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలో హస్తినలోనే మకాం వేసి తాజా రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో తమ చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరని కామెంట్ చేశారు. 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ కమిట్మెంట్ను నిరూపించుకున్నామని అన్నారు.
బలంగా తమ పోరాటం కేంద్రంపైనే కాబట్టి ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద మా వాయిసు వినిపించామని తెలిపారు. కేసీఆర్ గతంలో బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొచ్చారు కాబట్టి సవరించిన s ముసాయిదాను తాము గవర్నర్కు పంపామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల్లోనే బీసీ రిజర్వేషన్ నిర్ణయం ఉందని అన్నారు. ఇక రాష్ట్రపతికి రాజకీయలకు సంబంధం లేదని కామెంట్ చేశారు. లేకపోతే మోడీ చేతుల్లో రాష్ట్రపతి ఉన్నారా.. అదైనా బీజేపీ నేతలే చెప్పాలని సెటైర్లు వేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదిస్తే.. స్థానిక ఎన్నికల పక్రియను పూర్తి చేసేందుకు కేవలం 10 రోజుల సమయం చాలని అన్నారు. బీసీ రిజర్వేష్లపై తమ ఆఖరి పోరాటాన్ని పూర్తి చేశామని, ఇక నిర్ణయం తీసుకోవాల్సింది బీజేపీయేనని అని పేర్కొన్నారు. ఒకవేళ బిల్లును ఆమోదించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా వెళ్లాలో ఆలోచన చేస్తామని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..