న్యూఢిల్లీ, 7 ఆగస్టు (హి.స.)
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ లు బీసీల మెడలు కోసి మజ్లిస్ చేతిలో పెడుతున్నారని మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ చెప్పినట్లే నడుస్తారని, పరిపాలన చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని అడ్డుకునేందుకు.. ఓవైసీ కుటుంబానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి బీసీలకు అన్యాయం చెయ్యడంలో కాంగ్రెస్ కక్ష్య పూరితంగా వ్యవహరిస్తుందని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పోరుబాట ధర్నా నేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు.
'రిజర్వేషన్లతో ఎవరిని మోసం చెయ్యాలని అనుకుంటున్నారో రాహుల్ గాంధీ చెప్పాలి. ఇది దేశానికి ఆదర్శమా?, తెలంగాణ దేంట్లో దేశానికి మోడల్. బీసీల మెడలు కోయడంలో తెలంగాణ మోడల్ ఆహా. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 50 సీట్లు రిజర్వ్ చేస్తే .. 31 మంది నాన్ బీసీలు గెలిచారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, కేసీఆర్ లు సమాధానం చెప్పాలి. బీసీల మెడలు కోసి మజ్లిస్ చేతిలో పెడుతున్నారు. మజ్లిస్ పార్టీ చెప్పినట్లే నడుస్తారు.. పరిపాలన చేస్తారు. బీజేపీని అడ్డుకునేందుకు.. ఓవైసీ కుటుంబానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యం లేదు. తూతూ మంత్రంగా నిర్వహించిన సర్వే.. మోడల్ కాదు. సర్వే సమయంలో 25 శాతం ఇళ్లలోకి కూడా పోలేదు. బిల్ ఆమోదించాక రాష్ట్రపతికి పంపాల్సిన అవసరం లేదు. ఢిల్లీకి ఎందుకు పంపారు. బీసీలను మోసం చేయడంలో, అవినీతి చేయడంలో మేం నిరక్షరాస్యులం. ఓట్ల కోసం, అవినీతి కోసమో పార్టీలు మారము' అని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..