వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన గోదావరిఖని ట్రాఫిక్ పోలీసులు
తెలంగాణ, పెద్దపల్లి. 7 ఆగస్టు (హి.స.) పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రవాణా శాఖ నిబంధనలు పాటించిన మహిళలకు ట్రాఫిక్ పోలీసులు చీరలు పంపిణీ చేశారు. గురువారం గోదావరిఖని పట్ట
ట్రాఫిక్ పోలీస్


తెలంగాణ, పెద్దపల్లి. 7 ఆగస్టు (హి.స.)

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రవాణా శాఖ నిబంధనలు పాటించిన మహిళలకు ట్రాఫిక్ పోలీసులు చీరలు పంపిణీ చేశారు. గురువారం గోదావరిఖని పట్టణంలో రవాణాశాఖ నిబంధనల ప్రకారం హెల్మెట్ ధరించడంతో పాటు సీట్ బెల్టు ఇతరత్రా నిబంధనలు పాటించిన మహిళలకు చీరలను బహుమతులు అందించారు.ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రజలకు రవాణా శాఖ నిబంధనలను తెలియజేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ప్రతిఒక్కరూ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఉల్లంఘిస్తే జరిమాణాలు తప్పవ‌న్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్లు, ఎస్సై లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande