బీసీ రిజర్వేషన్లపై బీజేపీ యూ టర్న్ దేనికి?: ఆది శ్రీనివాస్
హైదరాబాద్, 7 ఆగస్టు (హి.స.) బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ ఎందుకు యూ టర్న్ తీసుకుందో చెప్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లులకు తెలంగాణ అసెంబ్లీలో మద్దతు తెలిపిన బీజేపీ
ఆది శ్రీనివాస్


హైదరాబాద్, 7 ఆగస్టు (హి.స.)

బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ ఎందుకు యూ టర్న్ తీసుకుందో చెప్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లులకు తెలంగాణ అసెంబ్లీలో మద్దతు తెలిపిన బీజేపీ కేంద్రంలో మాత్రం అడ్డుతగులుతోందని విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ముస్లింల పేరుతో బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఓబీసీల స్థితిగతులు, ఉప వర్గీకరణపై 2017 ఏర్పాటైన జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను ఎందుకు బహిర్గతం చేయడం లేదని మండిపడ్డారు. కేంద్రమే సుప్రీంకోర్టులో కులగణనకు వ్యతిరేకం అని అఫిడవిట్ దాఖలు చేసింది. రాహుల్ గాంధీ మాటతో కులగణన పూర్తి చేసి తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం జరిపింది కులగణన అని మత గణన కాదన్నారు. కేవలం ముస్లింలను అడ్డుపెట్టుకుని బీసీల నోటికాడి ముద్దను అడ్డుకుంటున్నారని నిలదీశారు. ఇకనైనా బీజేపీ దిగివచ్చి బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తెచ్చిన చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తెస్తే దాన్ని కేంద్రం అడ్డుకుంటోందన్నారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరితే ఇవ్వడం లేదన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande