ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి జలాలు.. హరీశ్రావు కీలక వ్యాఖ్యలు
తెలంగాణ, మెదక్. 7 ఆగస్టు (హి.స.) ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి జలాలను బనకచర్లకు తరలిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ఇవాళ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి క్యాంపు కార్యాలయ
హరీష్ రావు


తెలంగాణ, మెదక్. 7 ఆగస్టు (హి.స.) ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి జలాలను బనకచర్లకు తరలిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ఇవాళ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి మేడిగడ్డ పడావు పెట్టాడని, బనకచర్లకు నీళ్లు గురుదక్షిణగా పంపించాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రెండు లక్షల పింఛన్లను రద్దు చేసిందని ఆరోపించారు. తులం బంగారం ఇస్తామన్నారు. ఇప్పటికీ మొదలు పెట్టింది లేదన్నారు. రూ.4 వేల పింఛన్ ఇస్తామని చెప్పిన హామీ ఇప్పటివరకు నెరవేర్చ లేదన్నారు.

గోదావరి జలాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదని ఆరోపించారు. కన్నెపల్లి పంపులను ఇప్పుడు ఆన్ చేసినా.. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు నిండుతాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క చెరువు నిర్మించారా? అని, కమిషన్ల పేరుతో కాలయాపన తప్ప చేసింది ఏమీ లేదన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande