చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, 7 ఆగస్టు (హి.స.) దేశానికి అన్నం పెట్టే రైతన్నకు, వస్త్రానిచ్చే నేతన్నకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నెక్లెస్ ర
మంత్రి తుమ్మల


హైదరాబాద్, 7 ఆగస్టు (హి.స.)

దేశానికి అన్నం పెట్టే రైతన్నకు, వస్త్రానిచ్చే నేతన్నకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఇవాళ చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ ను మంత్రి ప్రారంభించారు. ఇవాల్టి నుంచి ఆగస్టు 17 వరకు ఈ చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ కొనసాగనుంది. ఈ సందర్భంగా చేనేత స్టాళ్లను, చేనేత ఉత్పత్తులను మంత్రి పరిశీలించారు. జైలు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లోని వస్త్రాలను మంత్రి పరిశీలించి అభినందించారు. అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత అవార్డులకు ఎన్నికైన వారు తయారుచేసిన ఉత్పత్తులను మంత్రి పరిశీలించి అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణ అథెంటిక్ వీవ్స్ లోగో, త్రిలింగా చీరనుఆవిష్కరించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande