ఎంఆర్పీకి మించి అమ్మకాలు చేస్తే చర్యలు తప్పవు : కలెక్టర్
తెలంగాణ, నాగర్ కర్నూల్. 7 ఆగస్టు (హి.స.) ఎరువుల బస్తాలను ఎంఆర్పీ ధరల కన్నా అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. గురువారం వారు కల్వకుర్తి పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఆకస్మికంగా తనిఖీ
నాగర్ కర్నూల్ కలెక్టర్


తెలంగాణ, నాగర్ కర్నూల్. 7 ఆగస్టు (హి.స.)

ఎరువుల బస్తాలను ఎంఆర్పీ ధరల కన్నా అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. గురువారం వారు కల్వకుర్తి పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఎరువుల దుకాణాల వద్ద రాసిపెట్టిన నిల్వలు, షాపు, గోదాంలో ఉన్న నిల్వలను పరిశీలించారు. రిజిస్టర్లలో నమోదు చేసిన ఎరువుల విక్రయ వివరాలు, నిబంధనల ప్రకారం ఉండకపోవడాన్ని కలెక్టర్ గమనించారు. రైతుల వివరాలు రిజిస్టర్లలో సక్రమంగా లేకపోవడాన్ని జిల్లా కలెక్టర్ తీవ్రంగా తప్పు పట్టారు. సరైన పత్రాలు ఎందుకు అందుబాటులో ఉంచలేదని అధికారులను ప్రశ్నించారు. పత్రాలు లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande