అమరావతి, 7 ఆగస్టు (హి.స.)
:చేనేత కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో శుభవార్త చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. కొత్త పథకం గురించి ప్రకటించారు. 'నేతన్న భరోసా' పథకం కింద చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.25 వేలు ఇస్తామని వెల్లడించారు. ఈ నెల నుంచి చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఉచిత విద్యుత్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా 93 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ