హైదరాబాద్, 7 ఆగస్టు (హి.స.)
ఫోన్ ట్యాపింగ్ కేసు లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్నే గత కేసీఆర్ ప్రభుత్వం ఎక్కువసార్లు ట్యాపింగ్ చేసిందని పోలీసులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కేంద్ర నిఘా వర్గాలు బండి సంజయ్ ముందు పెట్టాయి. రేపు సిట్ ఎదుట హాజరు కాబోతున్న బండి సంజయ్.. తన వద్ద ఉన్న ఆధారాలన్నీ సిట్ ఎదుట సమర్పించనున్నారు. దీంతో ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసును బీజేపీ జాతీయ అంశంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ అధికారులు హైదరాబాద్ వచ్చారని సమాచారం. ప్రస్తుతం బండి సంజయ్ భేటీ అయిన అధికారులు.. ఫోన్ ట్యాపింగ్ అంశంపైనే కీలకంగా చర్చిస్తున్నట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్