మీ విజ్ఞతకే వదిలేస్తున్న.. చిరంజీవి వ్యాఖ్యలకు సీపీఐ నారాయణ కౌంటర్
హైదరాబాద్, 7 ఆగస్టు (హి.స.) మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కౌంటర్ ఇచ్చారు. గతంలో చిరంజీవిపై తను మాట్లాడిన మాటలకు అప్పుడే క్షమాపణలు చెప్పి వెనక్కి తీసుకున్నానని కానీ మళ్లీ ఆవీడియోలను వైరల్ చేస్తూ తనను బద్నాం చేయ
సిపిఐ నారాయణ


హైదరాబాద్, 7 ఆగస్టు (హి.స.)

మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కౌంటర్ ఇచ్చారు. గతంలో చిరంజీవిపై తను మాట్లాడిన మాటలకు అప్పుడే క్షమాపణలు చెప్పి వెనక్కి తీసుకున్నానని కానీ మళ్లీ ఆవీడియోలను వైరల్ చేస్తూ తనను బద్నాం చేయడం సరికాదని మండిపడ్డారు. రాజకీయాల్లో ఆరోపణలు సహజం అన్నారు. ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన నారాయణ.. చిరంజీవి చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. నిన్న ఓ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ తాను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని అయినా తనను కొంత మంది నేతలు విమర్శిస్తూనే ఉంటారని వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య ఓ నాయకుడు నన్ను అకారణంగా మాటలు అన్నారు. ఆ తర్వాత ఆయన ఓ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఓ మహిళ అడ్డుకుని ఎదురుతిరిగింది అని గతంలో నారాయణ చేసిన వ్యాఖ్యల అంశాన్ని చిరంజీవి ప్రస్తావించారు. దీంతో మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా స్పందిoచిన నారాయణ పై విధంగా స్పందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande