సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుముఖం: గజ్వేల్ ఏసీపీ నరసింహులు
తెలంగాణ, సిద్దిపేట. 7 ఆగస్టు (హి.స.) సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, సీసీ కెమెరాలు ఉన్న గ్రామాలలో ఎలాంటి కేసులు నమోదు కావడం లేదని గజ్వేల్ ఏసీపీ నరసింహులు అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా సిద్దిపేట జిల్లా రామారం గ్రామస్తుల సహకారంతో
గజ్వేల్ ఏసిపి


తెలంగాణ, సిద్దిపేట. 7 ఆగస్టు (హి.స.)

సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, సీసీ కెమెరాలు ఉన్న గ్రామాలలో ఎలాంటి కేసులు నమోదు కావడం లేదని గజ్వేల్ ఏసీపీ నరసింహులు అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా సిద్దిపేట జిల్లా రామారం గ్రామస్తుల సహకారంతో గ్రామంలో పది సీసీ కెమెరాలు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశారు. కాగా వీటిని గురువారం ఏసీపీ నరసింహులు, తొగుట సీఐ లతీఫ్, రాయపోల్ ఎస్ఐ మానసతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని, సీసీ కెమెరాలు మరింత భద్రతను కల్పిస్తాయన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ప్రతి ఒక్కరూ నిఘా ఉంచాలని, ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande