తెలంగాణ, ఆసిఫాబాద్. 7 ఆగస్టు (హి.స.)
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జనకాపూర్ రైతు వేదికలో గురువారం అధికారులు చేపట్టిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం వివాదానికి దారితీసింది. రేషన్ కార్డుల పంపిణీకి ముఖ్య అతిథిగా హాజరైన ఆసిఫాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి వేదికపై సంబంధిత లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంచుతుండగా..కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి శ్యాం నాయక్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం చోటుచేసుకుంది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు