మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు అక్కడికక్కడే మృతి
తెలంగాణ, మెదక్.7 ఆగస్టు (హి.స.) మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని చిన్న గొట్టిముక్కుల పంచాయతీ పరిధిలోని చాకరిమెట్ల సమీపంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ మధుకర్ రెడ
యాక్సిడెంట్


తెలంగాణ, మెదక్.7 ఆగస్టు (హి.స.)

మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని చిన్న గొట్టిముక్కుల పంచాయతీ పరిధిలోని చాకరిమెట్ల సమీపంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం శివ్వంపేటకు చెందిన కొడకంచి బాలమణి, నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ ఆంజనేయులు కారులో శివ్వంపేట నుండి నర్సాపూర్ వైపు వెళుతున్నారు. ఈ క్రమంలోనే చాకరి మెట్ల సమీపంలో మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో బాలమణి, డ్రైవర్ ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande