న్యూఢిల్లీ: 7 ఆగస్టు (హి.స.)
జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. త్రిసభ్య కమిటీ దర్యాప్తు నివేదికను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. అంతర్గత విచారణ కోసం ముగ్గురు హైకోర్టు జడ్జిలతో గతంలో కమిటీ వేసింది. వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన విషయం వాస్తవమేనని త్రిసభ్య కమిటీ తేల్చింది. ఈ నివేదికను సవాల్ వేస్తూ పిటిషన్ వేస్తే తాజాగా న్యాయస్థానం కొట్టేసింది. దీంతో ఆయనకు మరిన్ని కష్టాలు వెంటాడనున్నాయి. యశ్వంత్ వర్మ అభిశంసనకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే అభిశంసన తీర్మానాన్ని కేంద్రం ప్రవేశపెట్టనుంది. అదే గనుక జరిగితే స్వతంత్ర భారతదేశంలో పదవి నుంచి తొలగించబడిన మొదటి హైకోర్టు న్యాయమూర్తిగా వర్మ రికార్డుల్లోకి ఎక్కుతారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, 217, 218 ప్రకారం ప్రస్తుతం పార్లమెంటు దర్యాప్తు చేస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ