హైదరాబాద్, 7 ఆగస్టు (హి.స.)
30 శాతం వేతనాలు పెంచాలంటూ
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్మికులు చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. ఇప్పటికే వేతనాల పెంపుపై పలుమార్లు నిర్మాతలకు, ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు జరిగాయి. కానీ చర్చలు కొలిక్కి రాకపోవడంతో కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. గత నాలుగు రోజులుగా మొత్తం 24 క్రాప్ట్ లకు చెందిన కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. వేతనాలు పెంచే వరకు వెనక్కి తగ్గేది లేదని ఫిలిం ఫెడరేషన్ తేల్చి చెప్పింది. దీంతో టాలీవుడ్లో షుటింగ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఈరోజు ఫిల్మ్ చాంబర్లో నిర్మాతలు ఫెడరేషన్ సభ్యుల మధ్య మరోసారి కీలక చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలు తరువాత మధ్యాహ్నం ఎఫ్ఎసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజును ఫెడరేషన్ సభ్యులు కలవనున్నారు. ఆ తర్వాత తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డిని కలిసి తమ సమస్యలు వివరించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..