ఏపీలో ఏసీబీ కి..బారీ .అవినీతి. తిమింగలం.చిక్కింది
విజయవాడ, 7 ఆగస్టు (హి.స.) : ఏపీలో ఏసీబీ()కి భారీ అవినీతి తిమింగలం చిక్కింది. విజయవాడలో లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమశాఖ ఈఎన్‌సీ అబ్బవరపు శ్రీనివాస్‌ ఏసీబీ అధికారులకు చిక్కారు. గుత్తేదారు కృష్ణంరాజు నుంచి రూ.25లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏకలవ్
ఏపీలో ఏసీబీ కి..బారీ .అవినీతి.  తిమింగలం.చిక్కింది


విజయవాడ, 7 ఆగస్టు (హి.స.)

: ఏపీలో ఏసీబీ()కి భారీ అవినీతి తిమింగలం చిక్కింది. విజయవాడలో లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమశాఖ ఈఎన్‌సీ అబ్బవరపు శ్రీనివాస్‌ ఏసీబీ అధికారులకు చిక్కారు. గుత్తేదారు కృష్ణంరాజు నుంచి రూ.25లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల బిల్లులు చెల్లించేందుకు శ్రీనివాస్‌ భారీగా లంచం డిమాండ్‌ చేశారు. గుత్తేదారు ఆయనకు ఇప్పటికే రూ.25లక్షలు చెల్లించారు. మరో రూ.25లక్షలు ఇవ్వాలని శ్రీనివాస్‌ కోరడంతో కృష్ణంరాజు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు వలపన్ని ఈఎన్‌సీని పట్టుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande