పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీలో కలెక్టర్ పడక..
తెలంగాణ, యాదాద్రి భువనగిరి. 7 ఆగస్టు (హి.స.) పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి రాజాపేట మండలంలోని దూది వెంకటాపురం గ్రామంలో పంచాయతీ కార్యాలయం ఆవరణలో యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, హౌసిం
యాదాద్రి కలెక్టర్


తెలంగాణ, యాదాద్రి భువనగిరి. 7 ఆగస్టు (హి.స.)

పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా

బుధవారం రాత్రి రాజాపేట మండలంలోని దూది వెంకటాపురం గ్రామంలో పంచాయతీ కార్యాలయం ఆవరణలో యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, హౌసింగ్, సివిల్ సప్లై, వైద్య, జిల్లా గ్రామీణాభివృద్ధి, అటవీ, శిశు సంక్షేమ, ఎలక్ట్రిసిటీ, రోడ్లు, పంచాయతీ, లీడ్ బ్యాంక్, మిషన్ భగీరథ, ఎక్సైజ్, వ్యవసాయ, పశు వైద్య, మత్స్యశాఖ, వివిధ శాఖలు సాయంత్రం వేళ జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా అధికారులందరూ గ్రామంలోని ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడుతూ వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం వంటి పథకాలు అందాయా అని అడిగి తెలుసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande