తిరుపతి రేణిగుంట సమీపంలో అగ్నిప్రమాదం
తిరుపతి , 7 ఆగస్టు (హి.స.)తిరుపతి రేణిగుంట సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. తిరుపతి శ్రీ సిటీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఈచర్ ట్రక్ ఈ రోజు(గురువారం) తెల్లవారుజామున రేణిగుంట మండలం మర్రిగుంట సర్కిల్ వద్ద స్కూటర్ అడ్డురావడంతో అదుపు తప్పింది. ఈ ఘటనలో ట్రక్
తిరుపతి రేణిగుంట సమీపంలో అగ్నిప్రమాదం


తిరుపతి , 7 ఆగస్టు (హి.స.)తిరుపతి రేణిగుంట సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. తిరుపతి శ్రీ సిటీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఈచర్ ట్రక్ ఈ రోజు(గురువారం) తెల్లవారుజామున రేణిగుంట మండలం మర్రిగుంట సర్కిల్ వద్ద స్కూటర్ అడ్డురావడంతో అదుపు తప్పింది. ఈ ఘటనలో ట్రక్కు బోల్తా పడటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ తరుణంలో అతి కష్టం మీద లారీ ముందు అద్దాలు పగలగొట్టి డ్రైవర్ బయటకు దూకాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అగ్నిమాపక అధికారులు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరగడంతో అక్కడ ట్రాఫిక్ జాం నెలకొంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande