అమరావతి, 7 ఆగస్టు (హి.స.)రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు గుడ్ న్యూస్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు వరుసగా సెలవులు(School Holidays) ఉండనున్నాయి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఏపీ(Andhra Pradesh)లో రేపు(శుక్రవారం) పాఠశాలలకు సెలవు ఉండగా, తెలంగాణ(Telangana)లో ఆప్షనల్ హాలిడే గా తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థుల(Students)కు మరో సెలవు కూడా కలిసి వచ్చింది. ఏంటంటే.. తర్వాత రోజు ఆగస్టు 9వ తేదీన రాఖీ పౌర్ణమితో పాటుగా రెండో శనివారం వచ్చింది.
అలాగే, ఆగస్టు 10వ తేదీన ఆదివారం కావడంతో ఆ రోజు సెలవు ఉంటుంది. ఈ విధంగా విద్యార్థులకు మూడు రోజులు వరుసగా సెలవులు రానున్నాయి. మరుసటి వారంలోనూ వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఆగస్టు 15వ తేదీ (శుక్రవారం) స్వాతంత్ర దినోత్సవం కాగా ఆ రోజున పాఠశాలలు హాఫ్ డే ఉంటాయి. ఆగస్టు 16వ తేదీన శ్రీకృష్ణాష్టమి (శనివారం) సెలవు వచ్చింది. ఆగస్టు 17వ తేదీ ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి