అమరావతి, 7 ఆగస్టు (హి.స.)రాజధాని అమరావతిలో హ్యాండ్లూమ్ (Handloom) మ్యూజియం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నైపుణ్యం సృజనాత్మకత కలయిక చేనేత లు అని ముఖ్యమంత్రి తెలిపారు.
జాతీయ చేనేత దినోత్సవ (National Handloom Day) సందర్భంగా మంగళగిరిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీకి నేతన్నలకు అవినాభావ సంబంధం ఉందన్నారు. 11 వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అందరికీ అభినందనలు తెలిపారు. చేనేత వైభవానికి పుట్టినిల్లు తెలుగునేల... ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే ఓ సంపద చేనేత.. అని సీఎం అన్నారు. పొందూరు ఖద్దరును గాంధీజీ మెచ్చారని గుర్తు చేశారు. నాగరికతకు మూ లం నేతన్న, హరప్పా కాలం నుండి చేనేత అభివృద్ధి చెందిందన్నారు. కాకతీయుల కాలంలో నాణేలపైన చేనేతల ముద్రలు ఉన్నాయని తెలిపారు. బ్రిటిష్ వారు వ్యాపారం కోసం ఇక్కడి నుండి వచ్చి చేనేతల జీవితం పై ప్రభావం చూపారని అభిప్రాయపడ్డారు. అందుకే గాంధీజీ (Gandhi) సైతం విదేశీ వస్త్రాలను బహిష్కరించి కేవలం స్వదేశీ బట్టలను మాత్రమే ఉపయోగించమని చెప్పారని తెలిపారు. చేనేతలకు తెలుగుదేశం తో అవినాభావ సంబంధం ఉందన్నారు. చేనేతలు మొదటగా ఉపాధి కల్పించిన పార్టీ,నాయకుడు నందమూరి తారక రామారావు.. 40 సంవత్సరాల నా రాజకీయ జీవితం లో చేనేతకు రాజి లేని పోరాటం చేశానని చంద్రబాబు నాయుడు తెలిపారు. వైసీపీ హయాంలో చేనేత పరిశ్రమ పూర్తిగా కుదేలైందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి