న్యూఢిల్లీ: 7 ఆగస్టు (హి.స.)
భారత్ (India) ఎవరికీ తలవంచదని, భారతీయుల సార్వభౌమాధికారంపై ఎవరూ సుంకాలు విధించలేరని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka) ట్వీట్ చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పన్నులను 50 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఈ పన్నులపై హర్ష్ గోయెంకా ఎక్స్ ద్వారా తన స్పందనను తెలియజేశారు. మెరుగైన ప్రత్యామ్నాయలను కనుగొని మరింత అభివృద్ధి సాధిస్తామని పేర్కొన్నారు (US Tarrifs).
'మా ఎగుమతులపై మీరు సుంకాలు విధించవచ్చేమో గానీ, మా సార్వభౌమాధికారంపై మాత్రం కాదు. మేం డిస్కౌంట్లనే ఎంచుకుంటాం. మా ఆదేశాల ఒత్తిడి కంటే మాకు ఇంధన భద్రతే ముఖ్యం. మీరు సుంకాలను పెంచండి. మేం సంకల్పాన్ని పెంచుకుంటాం. మెరుగైన ప్రత్యామ్నాయలను కనుగొని స్వావలంభనను సాధిస్తాం. భారత్ ఎవరికీ తలవంచదు' అని హర్ష్ గోయెంకా ట్వీట్ చేశారు. ట్రంప్ విధిస్తున్న ఈ సుంకాల వల్ల అమెరికాయే ఆర్థికంగా నాశనం అవుతుందని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ