భూమన అనుచరుల ఆగడాల పై స్పందించిన హోంమంత్రి.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్
అమరావతి, 7 ఆగస్టు (హి.స.)వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) పై హోం మంత్రి అనిత(Home Minister Anitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ(Andhra Pradesh)లోని తిరుపతి జిల్లాలో వైసీపీ సోషల్ మీడియా(Social Media) ఇంచార్జి అనిల్ రెడ్డి దౌర్జన్యం అంటూ సామాజిక మ
అనిత


అమరావతి, 7 ఆగస్టు (హి.స.)వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) పై హోం మంత్రి అనిత(Home Minister Anitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ(Andhra Pradesh)లోని తిరుపతి జిల్లాలో వైసీపీ సోషల్ మీడియా(Social Media) ఇంచార్జి అనిల్ రెడ్డి దౌర్జన్యం అంటూ సామాజిక మాధ్యమంలో ఒక వీడియో వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. శ్రీనివాస వసతి గృహం ఎదురుగా ఉన్న షాప్ కాంటాక్ట్ తనకు రాసివ్వాలని ఓ గిరిజన యువకుడిపై దారుణంగా దాడి చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్(Video Viral) కావడంతో.. నిందితుడు అనిల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అమానవీయ ఘటన పై తాజాగా హోంమంత్రి అనిత స్పందిచారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. మాజీ మంత్రి భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుల ఆగడాల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande