అమరావతి, 7 ఆగస్టు (హి.స.)బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) మళ్లీ వానలు (Rains) జోరందుకోనున్నాయి. నేటి నుంచి రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉదయం పొడి వాతావరణం ఉంటుందదని, మధ్యాహ్నం వరకు కాస్త ఎండగా అనిపించినా.. సాయంత్రం తర్వాత వాతావరణం చల్లబడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తర్వాత వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఇవాళ తెలంగాణలోని యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే, శుక్రవారం (రేపు) యాదాద్రి భువనగిరి, జనగామ, వికారాబాద్, సిద్దిపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో.. శనివారం (ఎల్లుండి) నిర్మల్, కుమురం భీం, నిజామాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి