రాజీపడే ప్రసక్తే లేదు.. ట్రంప్‌ టారిఫ్‌ల వేళ మోదీ స్ట్రాంగ్‌ మెసేజ్‌
న్యూఢిల్లీ: 7 ఆగస్టు (హి.స.) రష్యా చమురును కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్‌పై సుంకాలను రెట్టింపు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. ఇప్పటివరకు ఉన్న 25శాతం సుంకాలను 50శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాలపై భారత ప్రధానమంత్రి నర
నిక్కీ హేలీ


న్యూఢిల్లీ: 7 ఆగస్టు (హి.స.) రష్యా చమురును కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్‌పై సుంకాలను రెట్టింపు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. ఇప్పటివరకు ఉన్న 25శాతం సుంకాలను 50శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాలపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) పరోక్షంగా స్పందించారు. రైతుల ప్రయోజనాలపై ఎన్నటికీ రాజీపడే ప్రసక్తే లేదంటూ అమెరికాను ఉద్దేశిస్తూ గట్టిగా బదులిచ్చారు.

దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌ స్వామినాథన్‌ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని దిల్లీలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికాతో వాణిజ్యం, టారిఫ్‌ల (Trump Tariffs on India) అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘రైతుల సంక్షేమమే మాకు అత్యంత ప్రాధాన్యం. రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో ఎన్నటికీ రాజీపడబోం. అలా చేయడం వల్ల మేం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాకు తెలుసు. రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం వ్యక్తిగతంగా ఎంత చెల్లించేందుకైనా నేను సిద్ధమే. భారత్‌ సిద్ధమే’’ అని మోదీ వ్యాఖ్యానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande