న్యూఢిల్లీ: 7 ఆగస్టు (హి.స.)
దేశీయ మార్కెట్లు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి (Stock Market Today). అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల నడుమ మన సూచీలు నష్టాల్లో ఉన్నాయి. రష్యా నుంచి చమురు కొనొద్దన్న తన హెచ్చరికలను పట్టించుకోని భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించడం మన మార్కెట్లపై ప్రభావం చూపించింది. ఉదయం 9.36 గంటల సమయంలో సెన్సెక్స్ 215 పాయింట్ల నష్టంతో 80,336 వద్ద మొదలైంది. నిఫ్టీ 67 పాయింట్లు క్షీణించి, 24,502 వద్ద కదలాడుతోంది.
ఏ షేర్లు ఎలా..?
హీరో మోటార్‌కార్ప్, ట్రెంట్, సిప్లా, టైటాన్ కంపెనీ, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్, కొటక్ మహీంద్రా, జియో ఫైనాన్షియల్, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. భారత్ దిగుమతులపై ఇప్పటికే 25% సుంకాలను విధించిన ట్రంప్.. దానిని 50 శాతానికి పెంచారు. అదనంగా జరిమానా, సుంకంగా దీనిని పేర్కొంటూ.. బుధవారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ