న్యూఢిల్లీ: 7 ఆగస్టు (హి.స.) : దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలను పునరుద్ధరించేందుకు తమ ప్రభుత్వం సమగ్ర దృష్టితో కృషి చేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. గత 11 ఏళ్లుగా పారదర్శకమైన, వేగవంతమైన, పౌరకేంద్రీకృతమైన పాలనను దేశం చూస్తోందని పేర్కొన్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా దిల్లీలో నిర్మించిన మొదటి భవనం కర్తవ్య భవన్-03ను మోదీ బుధవారం ప్రారంభించారు. మంత్రిత్వశాఖలతో పాటు వాటి విభాగాలను ఒకే తాటిపైకి తీసుకురావడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా కర్తవ్యపథ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా విజయగాథను లిఖించేందుకు మనమంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ