హైదరాబాదు లో శరవేగంగా భారీ భారీ డేటా సెంటర్ పనులు
హైదరాబాదు లో శరవేగంగా భారీ భారీ డేటా సెంటర్ పనులు
హైదరాబాదు లో శరవేగంగా భారీ భారీ డేటా సెంటర్ పనులు


హైదరాబాదు, 21 మే (హి.స.)

అంతర్జాతీయ ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్, మనదేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అతిపెద్ద డేటా సెంటర్ను కొన్ని నెలల్లోనే అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ‘దక్షిణ భారత ఐటీ హబ్ అయిన హైదరాబాద్లో ఈ భారీ డేటా సెంటర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి’ అని మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు పునీత్ చందోక్ ఒక కార్యక్రమంలో వెల్లడించారు. దేశీయంగా కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్ సేవలకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భారత్లో మైక్రోసాఫ్ట్ అందిస్తున్న అజూర్ క్లౌడ్ సేవలతోపాటు, కోపైలెట్ 365 ఏఐ అసిస్టెంట్లకు మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande